Delhi Liquor Scam: నేడు నిందితులు అభిషేక్ బోయినపల్లి విజయ్ నాయర్ బెయిల్ రద్దుపై విచారణ
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ ఇప్పటికే అనేక మందిని అదుపులోకి తీసుకున్నది. వీరిలో అభిషేక్ బోయినపల్లి, వ్యాపారవేత్త విజయ్ నాయర్‌లు ఉన్నారు. వీరి బెయిల్ రద్దుపై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనున్నది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వీరికి రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు నవంబర్ 14వ తేదీన బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ రద్దును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో సీబీఐ అధికారులు పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ జరగనున్నది. బెయిల్ రద్దుపై ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు వీరికి నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం మనీ లాండరింగ్ కేసులో వీరు తీహార్ జైల్లో ఉన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ అధికారులు వరసగా ఈ కేసులో దాడులు నిర్వహిస్తున్నారు. విడివిడిగా కేసులు నమోదు చేస్తున్నారు. స్కామ్ కేసులో సీబీఐ కేసులు నమోదు చేస్తుండా, ఇదే స్కామ్‌లో మనీ లాండరింగ్ కింద ఈడీ కేసులు నమోదు చేస్తున్నది. ఈ కేసులో మరికొంత మందిని త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.