కరోనా ఆంక్షలను కఠినతరం చేసిన ఢిల్లీ సర్కార్
దేశంలో తగ్గినట్టే తగ్గి ఇప్పుడు ఒక్కసారిగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఢిల్లీలో కరోనా ఆంక్షలు కఠిన తరం చేసింది ప్రభుత్వం. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పని సరి చేసింది. మాస్క్ లేకపోతే 500 రూపాయల జరిమానా విధిస్తామని ప్రకటించింది. స్కూళ్లలో విద్యార్థులు, సిబ్బందికి థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి చేసింది. మరోవైపు కార్లలో ప్రయాణించే వారికి మాస్క్ నుంచి మినహాయింపు ఇచ్చింది ఢిల్లీ ప్రభుత్వం. ప్రతీ ఒక్కరూ కచ్చింతంగా కరోనా నిమయాలను పాటించాలని హెచ్చరించింది కేజ్రీవాల్ సర్కార్.
ఢిల్లీలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కోవిడ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో పాటు యూపీలోని నొయాడాలో సైతం కేసులు అధిక సంఖ్యలో నమోదు కావడంతో ఢిల్లీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది