Manish Sisodia: మార్చి 6 వరకు సిసోడియా రిమాండ్ పొడిగింపు
Delhi Court extends Manish Sisodia’s CBI remand till March 6th
ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీశ్ సిసోడియా మరి కొన్ని రోజుల పాటు సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. మార్చి 6 వరకు సీబీఐ రిమాండ్ పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది. సిసోడియా పెట్టుకున్న బెయిల్ పిటిషన్ మార్చి 10న విచారిస్తానని కోర్టు తెలిపింది.
సిసోడియాకు చుక్కెదురు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీశ్ సిసోడియాను గత ఆదివారం సీబీఐ అరెస్టు చేసింది. 5 రోజుల పాటు సీబీఐ కస్టడీలో సిసోడియా ఉన్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ చుక్కెదురయింది. ఢిల్లీ కోర్టును ఆశ్రయించమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. బెయిల్ ప్రయత్నాలు చేశారు.
మార్చి 10న బెయిల్ విచారణ
మార్చి 10వ తేదీని బెయిల్ విషయం విచారణ చేపడతామని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు సీబీఐ అధికారులు కూడా కోర్టును ఆశ్రయించారు. సిసోడియా కస్టడీని పొడిగించాలని కోరారు. అధికారుల విన్నపాన్ని మన్నించిన కోర్టు మరో 3 రోజుల పాటు మనీశ్ సిసోడియాను కస్టడీకి అనుమతించింది.