ఐపీఎల్: బోణీ కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బోణీ కొట్టింది. బ్రాబౌర్న్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణిత ఓవర్లలో 177/5 పరుగుల భారీ స్కోర్ చేసింది.
అనంతరం 178 పరుగులు లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ ఓ దశలో 72 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. దీంతో ఢిల్లీకి ఓటమి తప్పదనుకున్నారంతా.. కానీ ఢిల్లీ బ్యాట్స్‌మెన్స్ లలిత్ యాదవ్ 48, శార్దూల్ ఠాకూర్ 11 బంతుల్లో 22, అక్షర్ పటేల్ 17 బంతుల్లో 38 పరుగులు చేయడంతో 18.2 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది.