India Corona Update: దేశంలో తగ్గిన కరోనా కేసులు..
దేశంలో కరోనా కేసులు తగ్గాయి. కొత్తగా 9 వేల 923 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఆదివారం కోవిడ్ కేసుల సంఖ్య 10 వేలకు పైగా నమోదు కాగా సోమవారం నాడు 10 వేల దిగువకు చేరాయి. దీంతో పాటు కొత్తగా కరోనా నుంచి 7 వేల 293 మంది కోలుకున్నారని, కోవిడ్‌తో పోరాడి 17 మంది మరణించారని భారత ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కేరళలోనే నమోదైనట్లు భారత వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కేరళలో 2 వేల 786 కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 2 వేల 354 కేసులు, ఢిల్లీలో వెయ్యి 60 కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశంలో ప్రస్తుతం 79 వేల 313 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే 22.4 శాతం కేసులు తగ్గాయి.
మరోవైపు కొత్తగా నమోదైన కేసులతో కలిపి దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4 కోట్ల 33 లక్షల 19 వేల 396 మంది కరోనా బారిన పడగా.. అందులో 4 కోట్ల 27 లక్షల 15 వేల 193 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 5 లక్షల 24 వేల 890కి చేరింది. దీంతో పాటు దేశంలో రికవరీ రేటు 98.61 శాతంగా ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 2.55 శాతంగా ఉందని కేంద్ర వైద్య అధికారులు తెలిపారు. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ కొనసాగుతోందని వైద్యాధికారులు తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు 196 కోట్ల 32 లక్షల 43 వేల కరోనా డోసులు పంపిణీ చేసినట్లు తెలిపారు. నిన్న ఒక్క రోజే 13 లక్షల 24 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.