ASER 2022: మహారాష్ట్ర విద్యార్ధులు లెక్కల్లో వెరీ పూర్
Decline in Maths knowledge among govt school students in Maharashtra
వార్షిక విద్యా నివేదిక 2022లో గణాంకాలు మహారాష్ట్రలో విద్యార్ధుల దీన స్థితిని తెలియజేస్తున్నాయి. అక్కడి పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులు లెక్కల్లో చాలా చాలా వీక్ అని తెలుస్తోంది. అదే విధంగా కనీసం చదివే కెపాసిటీ కూడా లేని విద్యార్ధుల సంఖ్య కూడా చాలా ఎక్కువుగా ఉంది.
ఇక తరగతుల వారీగా లెక్కల్లో విద్యార్ధుల ప్రతిభ ఎలా ఉందో పరిశీలిస్తే అనేక విషయాలు తెలుస్తున్నాయి. మూడో తరగతి విద్యార్ధుల్లో కేవలం 18.5 శాతం మంది విద్యార్ధులు మాత్రమే తీసి వేతలు (subtraction) చేయగలుగుతున్నారు. మిగతా విద్యార్ధులు ఆ విషయంలో వెనకబడి ఉన్నారు.
ఇక భాగాహారం (division) విషయంలో చూసినట్లయితే 5వ తరగతి, 8వ తరగతి విద్యార్దులు చాలా పూర్ అని తేలింది. వారిలో కేవలం 20.1 శాతం మంది మాత్రమే భాగాహారం చేయగలుగుతున్నారు. మిగతా వారు వెనకబడి ఉన్నారు. ఇక చదివే విషయాన్ని పరిశీలిస్తే 5వ తరగతి విద్యార్ధుల్లో కేవలం 55.5 శాతం మంది మాత్రమే 2వ తరగతికి చెందిన పుస్తకాలను చదవగలుగుతున్నారు. మిగతా వారు ఈ విషయంలో వెనకబడి ఉన్నారు.
పాఠశాలల్లో కంప్యూటర్ల వాడకం గురించి తెలియజేసే గణాంకాలు మరింత ఆశ్చర్య కరంగా ఉన్నాయి. మహారాష్ట్రలో ఉన్న మొత్తం పాఠశాలల్లో కేవలం 34 శాతం స్కూల్స్ మాత్రమే కంప్యూటర్లను కలిగి ఉన్నాయి. కరోనా మహమ్మారి విజృంభించిన తర్వాత విద్యావిధానంలోను, నేర్చుకునే విధానంలోను వచ్చిన మార్పులు గణనీయంగా ఉన్నాయి.
మహారాష్ట్రలో 33 జిల్లాల్లో 983 గ్రామాల్లో 19396 ఇళ్లను పరిగణలోకి తీసుకున్నారు. మొత్తం 823 స్కూల్స్ లో సర్వే చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్న విద్యార్ధలు సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. 2018లో 61.6 శాతం ఉన్న చేరికలు 2022 నాటికి 76.4 శాతానికి పెరిగాయి. ప్రైవేట్ స్కూల్స్ లో చేరుతున్న వారి సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతోంది. 2018లో 37.6 శాతం ఉన్న ఈ సంఖ్య 2022 నాటికి 32.1 శాతానికి పడిపోయింది.