DCW Chief Swati Maliwal: నా తండ్రే లైంగికంగా వేధించేవాడు ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్
DCW Chief Swati Maliwal: ఈ మద్యే బాల్యంలో తండ్రి చేతుల్లో లైంగిక వేధింపులకు గురైన ఖుష్బూ వ్యాఖ్యలు మరువకముందే.. ఢిల్లీ మహిళా కమిషన్ ఛీఫ్ స్వాతీ మలివాల్ సైతం అదే తరహాలో తననూ తండ్రి వేధించినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. బాల్యంలో తన తండ్రి తనను లైంగికంగా వేధించాడని ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మాలివాల్ తెలిపారు. మా నాన్న నన్ను దారుణంగా కొట్టేవాడు. ఆయన ఇంటికి వచ్చాడంటే భయం వేసేది. రాత్రంగా మంచం కింద దాక్కు నే దానిని. ఇలా ఎన్నోసార్లు జరిగింది అని తెలిపింది.
బాల్యం లోనే మహిళల హక్కుల కోసం ఏం చేయాలి .. ఆడవాళ్లకు ఎలా సాధికారత కల్పించాలా అని రాత్రంతా ఆలోచించేదాన్నని అన్నారు. ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడేవారికి గుణపాఠం చెప్పాలనుకున్నట్టు స్వాతి మాలివాల్ పిలుపునిచ్చారు. జీవితంలో దారుణాలను ఎదుర్కొన్నవారు.. ఇతరుల బాధను మరింత అర్థం చేసుకుంటారని అన్నారు. మహిళా దినోత్సవ అవార్డులు లభించిన వారిలో చాలావరకు మహిళలది దాదాపు ఇదే తరహా పరిస్థితి అయిఉండచ్చు అని అన్నారు. సమాజంలో మహిళకు సాధికారికత రావాలి సమానత్వపు హక్కు తేవాలి. చట్టాలు ఎన్నితెచ్చిన అవి పేపర్లకే పరిమితమవుతున్నాయి.. కానీ అమలుకు నోచుకోవడంలేదని అన్నారు. అమలుకు నోచుకుంటే ఆడవారిపై ఇన్ని దారుణ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇలాంటి సంఘటనలే మనం చూస్తున్నాం. అలాంటివారిని ఉపేక్షించకూడదని అన్నారు.