కులమతాలకు అతీతంగా.. కలిసి మెలిసి ఉండాలని చెప్పాల్సిన టీచర్లే.. ఓ విద్యార్థిని కులం (Cast) పేరుతో దూషించారు. తక్కువ కులం వారని వేధింపులకు గురి చేశారు. ఉపాధ్యాయుల వేధింపులు తట్టుకోలేక పోయిన ఆ విద్యార్థి క్లాస్ రూమ్‌లోనే ఆత్మహత్య చేసుకున్నాడు.
Student: కులమతాలకు అతీతంగా.. కలిసి మెలిసి ఉండాలని చెప్పాల్సిన టీచర్లే.. ఓ విద్యార్థిని కులం (Cast) పేరుతో దూషించారు. తక్కువ కులం వారని వేధింపులకు గురి చేశారు. ఉపాధ్యాయుల వేధింపులు తట్టుకోలేక పోయిన ఆ విద్యార్థి క్లాస్ రూమ్‌లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. రాజస్థాన్‌లోని (Rajasthan) బెహ్రోర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో (Government School) జరిగింది ఈ ఘటన.
కోట్‌పుత్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 15 ఏళ్ల దళిత విద్యార్థి 9వ తరగతి చదువుతున్నాడు. కొద్దిరోజులుగా ఇద్దరు ఉపాధ్యాయులు అతడిని కులం పేరుతో దూషించారు. చిత్రహింసలకు గురి చేశారు. తోటి విద్యార్థుల వద్ద అతడిని వేరు చేసి మాట్లాడారు. క్లాస్ రూమ్‌లో అతడిని వెనుక బెంచ్‌లో కూర్చోబెట్టారు. ఈ విషయాన్ని సదరు విద్యార్థి తన తండ్రికి చెప్పాడు. మరునాడు అతని తండ్రి వచ్చి ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశాడు.
కానీ ప్రిన్సిపల్ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. పైగా ఆ తర్వాత విద్యార్థికి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. దీంతో తట్టుకోలేక పోయిన విద్యార్థి క్లాస్ రూమ్‌లో ఎవరూ లేనిది చూసి సీలింగ్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు డెడ్ బాడీతో స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ బిడ్డను వేధించిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులు ఇద్దరు టీచర్లపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. అటు విద్యాశాఖ అధికారులు కూడా ఇద్దరు టీచర్లపై సస్పెన్షన్ వేటు వేశారు.