Cyclone Mandous: ముంచుకొస్తున్న మాండస్ తుఫాను, అప్రమత్తమైన అధికార యంత్రాంగం
Cyclone Mandous intensified
మాండుస్ తుఫాను ముంచుకొస్తోంది. ఈ రోజు అర్ధరాత్రి మహాబలిపురం, శ్రీహరి కోట సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం చెన్నైకు సుమారు 130 కిలోమీటర్ల దూరంలో తుఫాన్..పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. చెన్నై సహా తమిళనాడులో పలు ప్రాంతాల్లో మాండస్ తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. దీంతో సీఎం స్టాలిన్ అప్రమత్తం అయ్యారు. అధికారులతో సమీక్ష చేపట్టారు. కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ శాఖ…15 వేల విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్స్ సిద్ధం చేసింది.
తుఫాన్ గాలులు తీవ్రతకు కరైకుడిలో గాజు కిటకి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. రేపు తమిళనాడులోని 30 జిల్లాల్లో స్కూల్స్ , కాలేజీలకు సెలవులు ప్రకటించారు. చెన్నై నుండి వెళ్ళే 26 విమాన సర్వీసులను రద్దు చేశారు. తమిళనాడు లోతట్టు జిల్లాల్లో భారీ వర్షాలు మొదలైన కారణంగా మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు.
చెన్నై, కడలూరు, మైలాడుతురై, నాగపట్టణం, తిరువారూరు, తంజావూరు, పుదుక్కోట్టై , కాంచీపురం, చెంగల్పట్టు, కళ్లకురిచ్చి, తిరుచ్చి, శివగంగై, రామనాథపురం జిల్లాలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 169 పునరావాస కేంద్రాల ఏర్పాటు చేసింది.
చెన్నై సమీపంలో తీరం దాటిన తరువాత తిరుపతి, చిత్తూరు,అన్నమయ్య, నెల్లూరు జిల్లాల్లో మాండూస్ తుఫాన్.. తీవ్రమైన ప్రభావం చూపబోతుంది. గంటలకు 80 నుండి వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తిరుపతి, చిత్తూరు,అన్నమయ్య, నెల్లూరు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు
భారీ నుండి అతీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయట రావద్దని అధికారులు..సూచిస్తున్నారు. నివాస ప్రాంతాలకు సమీపంలో నదుల, చెరువు,డ్యాంలు ఉంటే అటువంటి వారు సేఫ్టీ ప్రదేశాలను వెళ్ళాలని అధికారులు సూచిస్తున్నారు.
Cyclone Mandous Effect seen at Visakhapatnam now. pic.twitter.com/lkhtPKsytU
— Andhra Pradesh Weatherman (@APWeatherman96) December 9, 2022