తనపై కాల్పులు జరపొద్దంటూ ఫ్లకార్డు పట్టుకొని ఓ నిందితుడు (Criminal) పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తాను లొంగిపోయేందుకు వచ్చానని.. తనను ఏమీ చేయొద్దని పోలీసులను వేడుకున్నాడు.
UP: తనపై కాల్పులు జరపొద్దంటూ ఫ్లకార్డు పట్టుకొని ఓ నిందితుడు (Criminal) పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తాను లొంగిపోయేందుకు వచ్చానని.. తనను ఏమీ చేయొద్దని పోలీసులను వేడుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని (Uttarpradesh) గోండా జిల్లాలో జరిగింది.
మహులి ఖోరికి చెందిన అంకిత్ వర్మ అనే వ్యక్తి ఆరు నెలల క్రితం దొంగతనానికి పాల్పడ్డాడు. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తుండగా.. వారిని గన్‌తో బెదిరించి బ్యాగ్, ఫోన్ దొంగిలించి పరారయ్యాడు. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులు అంకిత్ వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి అంకిత్ వర్మ పరారీలో ఉన్నాడు. ఆరు నెలలుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు. అతనిపై పోలీసులు రూ. 20 వేల రివార్డును కూడా ప్రకటించారు.
అయితే కొద్దిరోజులుగా యూపీ సర్కార్.. రౌడీలు, గుండాలపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. రౌడీలను, గుండాలను ఎన్‌కౌంటర్ చేస్తోంది. ఈక్రమంలో నిందితుడు అంకిత్ వర్మ.. ఎక్కడ ఎన్‌కౌంటర్ చేస్తారేమోనని పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ‘నేనులొంగిపోవడానికి వచ్చాను. నన్ను ఎన్‌కౌంటర్ చేయకండి’ అంటూ పోలీస్ స్టేషన్ ఎదుట అంకిత్ వర్మ ఫ్లకార్డు ప్రదర్శించాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.