ఢిల్లీలో మూడు రోజుల పాటు జరిగిన CPM కేంద్ర కమిటీ సమావేశాలు నిన్నటితో ముగిశాయి. అక్టోబర్ 29,30, 31 తేదీల్లో పలు అంశాలపై పార్టీ నేతలు చర్చించారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీలో మూడు రోజుల పాటు జరిగిన CPM కేంద్ర కమిటీ సమావేశాలు నిన్నటితో ముగిశాయి. అక్టోబర్ 29,30, 31 తేదీల్లో పలు అంశాలపై పార్టీ నేతలు చర్చించారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కీలక వ్యాఖ్యలు చేశారు.
బిజేపేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలపై గవర్నర్ల వ్యవహారల శైలిని ఏచూరి ఖండించారు. కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం గవర్నర్ల వ్యవస్థను యధేచ్ఛగా దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు భావసారూప్యత గల పార్టీలతో చర్చించి, కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. గవర్నర్ల వ్యవస్థపైన, సమాఖ్య వ్యవస్థపై చర్చ జరగాలని ఆకాంక్షించారు. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, శరద్ పవార్ కుమార్తె సుప్రియ సూలేతో చర్చించామని తెలిపారు.
సుదీర్ఘ ప్రజా పోరాటాలకు భావ సారూప్య పార్టీలు సిధ్దం కావాలని కోరారు. మునుగోడు ఎన్నికల నేపధ్యంలో MLAల కొనుగోలు వ్యవహారం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. TRS MLAలకు ఇవ్వజూపిన మొత్తం గురించి వచ్చిన వార్తలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయని అన్నారు. సెక్యులర్ పార్టీలు సంఘటితమవ్వాలనే ఆలోచన మంచిదని అన్నారు.
కేసిఆర్ ప్రతిపాదిత నూతన జాతీయ రాజకీయ వేదిక BRSతో పాటు, అనేక సెక్యులర్ పార్టీలు కూడా అదే కోరుకుంటున్నాయని ఏచూరి సీతారాం అన్నారు. ప్రధాని మోడీ మతతత్వ వాదాన్ని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు.
Our Central Committee met in New Delhi on October 29, 30 & 31, 2022.
The full text of our statement is here: https://t.co/7sOeetFbO8 pic.twitter.com/U8hGV1jf4q— Sitaram Yechury (@SitaramYechury) November 1, 2022