Corona in India: మన దేశంలో మూడోసారి లాక్ డౌన్ తప్పదా?
Corona surfaced in India: మన దేశంలో కరోనా మళ్లీ కలవరపెడుతోంది. రోజువారీ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే 17 వేల 336 మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. 13 మంది చనిపోయారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 88 వేల 284కి పెరిగింది. గడచిన 24 గంటల్లో కొవిడ్ నుంచి 13 వేల 29 మంది కోలుకున్నారు. కానీ రికవరీ అవుతున్నవారి సంఖ్యతో పోల్చితే కొత్త కేసులు అధికంగా నమోదవుతున్నాయి.
యాక్టివ్ కేసుల సంఖ్య 0.20 శాతానికి పెరగటం గమనార్హం. ఈ నేపథ్యంలో పాజిటివిటీ రేట్ ఆందోళనకరంగా మారింది. డైలీ పాజిటివిటీ రేట్ నాలుగు శాతం దాటడం వైద్య, ఆరోగ్య శాఖ వర్గాల్లో కలకలం రేపుతోంది. దేశంలోని దాదాపు తొమ్మిదీ పది రాష్ట్రాల్లో ఈ వైరస్ వ్యాప్తి వేగం పుంజుకుంటోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.
కొవిడ్ గనక కంట్రోల్ కాకపోతే మూడోసారి లాక్ డౌన్ తప్పదేమోనని ప్రజలు భయపడుతున్నారు. 2020లో కరోనా ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 43 కోట్ల, 36 లక్షల 2 వేల 294కి చేరింది. మరణాలు 5 లక్షల 24 వేల 954కి పెరిగాయి. కోలుకున్నారి సంఖ్య 42 కోట్ల 74 లక్షల 9 వేల 56గా నమోదైంది.