Corona Cases: మళ్లీ కోరలు చాస్తున్న కరోనా , కొత్తగా 841 కేసులు నమోదు
Corona Cases in India are increasing
కరోనా మహమ్మారి మరోసారి విజృంభించడానికి సిద్ధమౌతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా నమోదౌతున్న కేసుల సంఖ్యను చూస్తే మరోసారి కరోనా విశ్వరూపం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోజువారీ నమోదౌతున్న కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఏకంగా 841 కొత్త కేసులు వెలుగు చూశాయి. నెల రోజుల క్రితం రోజు వారీ కేసుల సంఖ్య కేవలం 156గా ఉండేది. ఇప్పుడా సంఖ్య విపరీతంగా పెరగడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌లో అత్యధిక కేసులు నమోదు అవుతున్నట్లు కేంద్రం గుర్తించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. కరోనా కేసులు పెరుగుతున్ననేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఆరు రాష్ట్రాలు మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటకలకు లేఖలు రాశారు. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కేసుల తీవ్రత పెరగకుండా ముందే కట్టడి చర్యలు చేపట్టాలని సూచించారు.
Corona cases increased in India in 150 days maximum total active cases increased to 5093 pic.twitter.com/gO7FQyWTqi
— ALOK SINGH (@ALOKSIN80726973) March 18, 2023