Covid-19 Cases: కరోనా కేసులు పెరుగుతున్నాయ్..రాష్టాలకు కేంద్రం హెచ్చరిక
Covid-19 Cases:తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్ళీ పెరుగుతుండడంతో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీకి లేఖ రాశారు. దేశంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 5,026కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 796 కేసులు నమోదయ్యాయి. 109 రోజుల్లో 5వేలకు పైగా యాక్టివ్ కేసులు రిజిస్టర్ అయ్యాయి.
తాజా కేసుల దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,46,94,349కి చేరాయి. జార్ఖండ్, మహారాష్ట్రలో ఒక్కొక్కరు ఒక్కో కరోనాతో మరణించారు. ఇప్పటి వరకు 4,41,58,161 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.80శాతం ఉండగా.. మరణాల రేటు 1.19శాతంగా ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది. ముగిసిన వారంలో 132 కేసులు నమోదు కాగా, మార్చి 8-15 వరకు 267 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 0.31శాతానికి చేరింది. కేసులు పెరుగుతుండడంతో అప్రమత్తంగా ఉండాలని, వ్యాక్సినేషన్ తప్పనిసరిగా అనుసరించాలని ఆదేశించారు.
కరోనా విషయంలో జాగ్రతగా ఉండాలని మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ, కర్ణాటకలకు ఆదేశాలే ఇచ్చారు. తెలంగాణలో గురువారం కొత్తగా 27 కరోనా కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. వీటిలో హైదరాబాద్‌లో 12, సంగారెడ్డిలో 2 కేసులు, మిగిలిన 13 కేసులు 13 జిల్లాల్లో ఉన్నాయని తెలిపింది.