Supreme Court: మత మార్పిడి అనేది తీవ్రమైన సమస్య..సుప్రీంకోర్టు
Supreme Court: భారత దేశంలో ఎవరు ఏ మతమైనా భారతీయుడుగానే పరిగణిస్తారు. మతం నేడు సంపాదించిన ఆస్తులకన్నా ఎక్కువైంది. ఎక్కడ చూసిన ఈ మతవిద్వేషాలే ఎక్కువగా జరుగుతున్నాయి. ఎన్నికలొస్తే చాలు కులం మతం అంటూ రాజకీయనాయకులు ఈ ప్రచారాన్ని ఎక్కువగా చేస్తున్నాయంటూ ఢిల్లీ ధర్మాసనం తప్పుపట్టింది. మత మార్పిడి అనేది తీవ్రమైన సమస్య అని పేర్కొంది.
మతం అనేది రాజకీయ రంగు పులుముకోకూడని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మోసపూరిత మత మార్పిడులను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేయాలని దాఖలైన పిటిషన్‌పై అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి సహాయాన్నిన్యాయస్థానం కోరింది. బెదిరింపులు, బహుమతులు, డబ్బులు ఆశచూపి ప్రలోభపెట్టడం ద్వారా జరుగుతున్న మత మార్పిడులకు చెక్ పెట్టాలని పిటిషనర్ కోరిన కేసులో హాజరుకావాలని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం వెంకటరమణిని కోరింది.
ప్రలోబాలద్వారా మత మార్పిడులు జరుగుతున్నట్లయితే.. ఏం చేయాలి? దిద్దుబాటు చర్యలు ఏమిటి?.. అంటూ అటార్నీ జనరల్ చెప్పాలని సుప్రీం కోర్ట్ కోరింది. విచారణ ప్రారంభంలో తమిళనాడు తరఫు సీనియర్ న్యాయవాది పి.విల్సన్, ఈ పిటిషన్‌ను రాజకీయ ప్రేరేపిత పిల్ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో అలాంటి మార్పిడుల ప్రశ్నే లేదని చెప్పారు. ఒకచోటలేకుంటే లేనట్టుకాదుకదా దేశం అంత జరుగుతున్నా పరిగణలోకి తీసుకోవాలని సూచించింది.