Manish Sisodia: సిసోడియా హత్యకు కుట్ర.. ఆప్
Manish Sisodia: ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయి జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైలుకు వెళ్లిన ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేత మనీష్ సిసోడియా భద్రత విషయంలో ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనీష్ సిసోడియా ను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తుంది. తీహార్ జైల్లోనే ఆయన హత్యకు కుట్ర పన్నారని ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేసారు. అక్కడ ఉన్న ఖైదీల్లో చాలా మందికి మానసిక స్థితి సరిగా లేదని.. వాళ్లు ఏమైనా చేయొచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తీహార్ జైలులో కరుడుగట్టిన నేరస్తులు ఉన్న సెల్ నంబర్ 1లో ఉంచారని విమర్శించింది. ఈ ఆరోపణలను ఢిల్లీ జైళ్ల శాఖ ఖండించింది. సిసోడియా కోసం విడిగా ఒక వార్డు కేటాయించినట్లు ప్రకటించింది. వార్డులో ఉన్నవారంతా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలని తెలిపింది. రిమాండ్ ఖైదీగా లభించే అన్ని ప్రాథమిక సౌకర్యాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. సీనియర్ సిటిజన్లు ఉండే సెల్ లోనే ఆయన్ను ఉంచామని.. ఈ విషయంలో ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని స్పష్టం చేశారు జైలు అధికారులు.