Conard Sangma: మేఘాలయ ముఖ్యమంత్రిగా కొనార్డ్ సంగ్మా ప్రమాణ స్వీకారం
Conrad Sangma takes oath as Meghalaya CM
నేషనల్ పీపుల్స్ పార్టీ చీఫ్ కొనార్డ్ సంగ్మ మేఘాలయ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. షిల్లాంగ్ నగరంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా, పార్టీ చీప్ జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంగ్మ నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ ఘన విజయం సాధించింది. బీజేపీ ప్రోత్రాహంతో తిరిగి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి పదవిని అధిష్టించడం సంగ్మాకు ఇది రెండవ సారి కావడం విశేషం.
రాజ్ భవన్లో ప్రమాణ స్వీకారానికి ముందు సంగ్మా ప్రేయర్ తన సహ ఎమ్మెల్యేలతో కలిసి మీటింగ్ లో పాల్గొన్నారు. అక్కడి నుంచి నేరుగా రాజ్ భవన్ చేరుకున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగ్మ, తన కేబినెట్ లోకి 11 మందిని తీసుకున్నారు. ప్రస్తుతం మంత్రి వర్గంలో బీజేపీకి చెందిన ఒకరికి, యూడీఎఫ్ పార్టీకి చెందిన ఇద్దరికి, HSPDP పార్టీకి చెందిన ఒకరికి మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన ఏడుగురికి కేబినెట్ లో స్థానం కల్పించారు. గవర్నర్ ఫగు చౌహాన్ సంగ్మాతో పాటు మంత్రులతో కూడా ప్రమాణ స్వీకారం చేయించారు.
ఎన్నికలకు ముందు బీజేపీ నాయకులు సంగ్మాపై అనేక ఘాటు విమర్శలు ఆరోపణలు చేశారు. అత్యంత అవినీతి ప్రభుత్వమని నిందించారు. సంగ్మాకు వ్యతిరేకంగా అనేక రకాలుగా ప్రచారం చేశారు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మొట్టసారిగా బీజేపీయే ముందుకు వచ్చి స్నేహ హస్తం అందించింది. ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించింది.
WATCH | National People's Party chief Conrad Sangma takes oath as the Chief Minister of Meghalaya for the second consecutive term in Shillong. pic.twitter.com/2PGCwtngX6
— Prasar Bharati News Services & Digital Platform (@PBNS_India) March 7, 2023
Watch | Prime Minister Narendra Modi attends the swearing-in ceremony of Meghalaya CM-designate Conrad Sangma and the state cabinet, at the Raj Bhavan in Shillong.
Union Home Minister Amit Shah and BJP national president JP Nadda are also present here pic.twitter.com/znphtZ0iiy
— DeshGujarat (@DeshGujarat) March 7, 2023
Conard Sangma