నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ చేసిన 9 తప్పిదాలను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించింది. ఈ తప్పులు చేసినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరింది.
Congress party highlights 9 Big Failures of Modi government
నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ చేసిన 9 తప్పిదాలను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించింది. ఈ తప్పులు చేసినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరింది.
పెద్దనోట్ల రద్దు వ్యవహారం, రైతు వ్యతిరేక చట్టాలు, మణిపూర్లో ఆరని మంటలు, మీడియాపై నియంత్రణ, రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం, విద్వేష పూరిత రాజకీయాలు, కశ్మీరీ పండిట్లను విస్మరించడం, కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో నిర్లక్ష్యం, ప్రభుత్వ ఉద్యోగాలను భక్తీ చేయకపోవడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు గుప్పించారు.
భారతదేశంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, పేదలు మరింత పేదలుగా మారుతున్నారని కాంగ్రెస్ నేతలు ప్రధాని మోడీకి గుర్తుచేశారు. ప్రజలకు చెందిన ఎన్నో ఆస్తులను ప్రధాని తన స్నేహితులకు ధారాదత్తం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు గుప్పించింది.
రైతులకు ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చడంతో మోడీ సర్కార్ విఫలమయిందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. రైతులకు కనీస మద్దతు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని కూడా కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. అదే విదంగా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన నరేంద్ర మోడీ ఆ విషయం మరిచిపోయారని కాంగ్రెస్ నేతలు గుర్తుచేశారు. తొమ్మిదేళ్లలో రైతుల ఆదాయం ఎందుకు రెట్టింపు కాలేదని ప్రశ్నించారు.
మోడీ ప్రభుత్వం జాతీయ భద్రతను గాలికి వదిలేసిందని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. భారత భూ భాగాలను చైనా ఆక్రమిస్తుంటే మోడీ సర్కార్ ఏమీ చేయలేకపోతోందని తప్పుబట్టారు. చైనా అధికారులతో ఇప్పటి వరకు 18 సార్లు సమావేశం జరిగినా ప్రయోజనం లేకపోయిందని కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో కూడా మోడీ ప్రభుత్వం సరైన రీతిలో వ్యవహరించలేదని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. దాదాపుగా 40 లక్షల మంది కరోనా కాటుకు బలైతే వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లిండంలో కేంద్రం పూర్తిగా వైఫల్యం చెందిందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.
𝐍𝐚𝐚𝐤𝐚𝐦𝐢 𝐊𝐞 𝟗 𝐒𝐚𝐚𝐥
9 years, 9 blunders#NaakamiKe9Saal pic.twitter.com/DQvsXZ9DSh
— Congress (@INCIndia) May 26, 2023
The BJP has now been in power for nine years. The authoritarian regime has completely failed on every front.
The Prime Minister must respond to these nine questions before the BJP begins to celebrate.#9saal9sawal #NaakamiKe9Saal pic.twitter.com/vVQKoonnvB
— Congress (@INCIndia) May 26, 2023
झूठे वादों और जनता की दुर्दशा पर भाजपा ने खड़ी की 9 साल की इमारत!
महंगाई, नफ़रत और बेरोज़गारी – प्रधानमंत्री जी, अपनी इन नाकामियों की लीजिए ज़िम्मेदारी!#NaakamiKe9Saal pic.twitter.com/G8VFAGAN0m
— Rahul Gandhi (@RahulGandhi) May 26, 2023