నేటి నుంచి కాంగ్రెస్ నవ సంకల్ప్ శిబిర్ సమావేశాలు…
నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ నవ సంకల్ప్ శిబిర్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ప్రత్యేక సమావేశంలో పాల్గొనే కాంగ్రెస్ నేతలు నవ సంకల్ప్ శిబిర్ కి చేరుకుంటారు. మధ్యాహ్నం 2:30 గంటలకు పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రారంభ ప్రసంగం చేస్తారు. అనంతరం ఈ సమావేశాలకు హాజరైన నేతలను ఆరు బృందాలుగా ఏర్పాటు చేసి ఆరు అంశాలపై చర్చించనున్నారు.
ఈ చర్చలు శనివారం రాత్రి7:30 గంటల వరకు కొనసాగుతాయి. శనివారం రాత్రి 8 గంటలకు పార్టీ ఏర్పాటు చేసిన ఆరు బృందాల సమన్వయకర్తలు సమావేశాలు నిర్వహిస్తారు. మే 15 వ తేదీ ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానున్నది. ఈ కమిటీ సమావేశంలో తీర్మానాలను ఆమోదించి ప్రకటనలు చేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ శిబిర్ సమావేశానికి హాజరైన నేతలతో ఫోటో సెషన్ ఏర్పాటు చేయనున్నారు. ఆ తరువాత మరోసారి కాంగ్రెస్ నేతలు సమావేశం అవుతారు. మధ్యాహ్నం3 గంటలకు రాహాజల్ గాంధీ ప్రసంగం, అనంతరం సోనియాగాంధీ ప్రసంగంతో శిబిర్ సమావేశాలు ముగుస్తాయి.