Congress MP Santokh Singh dies: రాహుల్ భారత్ జోడో యాత్ర లో విషాదం.. గుండెపోటుతో ఎంపీ మృతి
Congress MP Santokh Singh dies during Bharat Jodo Yatra: రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర లో విషాదం చోటుచేసుకుంది. యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్ చౌదరి గుండెపోటుతో మృతి చెందారు. పంజాబ్ ఫిలోర్ వద్ద యాత్రకు చేస్తుండగా… ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. దీంతో వెంటనే ఆయన్ను నేతలు, కార్యకర్తలు హాస్పటల్ కు తరలించగా మార్గ మధ్యలోనే ఆయన కన్నుమూశారు.
ఈ ఉదయం రాహుల్ పాద యాత్ర ప్రారంభించగా.. జలంధర్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కలిసి ముచ్చటించుకుంటూ కాసేపు నడిచిన ఆయన.. ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఒక్కసారిగా షాక్ గురయ్యారు రాహుల్..వెంటనే సంతోక్ సింగ్ ను ఫగ్వారాలోని విర్క్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ప్రకటించారు.
రాహుల్ గాంధీ జోడో యాత్రకు విరామం ఇచ్చి చౌదరి సంతోక్ ను చూసేందుకు ఆసుపత్రికి వెళ్లారు..తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంతోక్ సింగ్ చౌదరీ అకాల మృతిపట్ల పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ట్విట్టర్‌లో సంతాపం ప్రకటించారు. ఆయన ఆకాల మరణం తనను బాధించిందన్నారు.