Rahul Gandhi in Trouble: రాహుల్ గాంధీకి కొత్త చిక్కులు… పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు
Rahul Gandhi in Trouble: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చిక్కుల్లో పడిపోయారు. ఇటీవలే రాహుల్ గాంధీ లండన్‌లో పర్యటించారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో ఆయన ప్రసంగించారు. క్రేంబిడ్జి విశ్వవిద్యాలయంలో భారత్ ప్రజాస్వామ్యంపై కీలక వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. ఈ అంశాన్ని పార్లమెంటులో బీజేపీ నేతలు లేవనెత్తారు. విదేశాల్లో భారత ప్రజాస్వామ్యం గురించి మాట్లాడం ఏంటని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ భేషరతుగా క్షమాపణలు చెప్పాలని, క్షమాపణలు చెప్పేవరకు సభలో మాట్లాడనివ్వకూడదని పేర్కొంటూ లోక్‌సభ స్పీకర్‌కు బీజేపీ నేతలు లేఖ రాశారు. సభనుండి బహిష్కరించవచ్చేమో పరిశీలించాలని కూడా విజ్ఞప్తి చేశారు. కాగా, లండన్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రత్యేక పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు చేయనున్నది.
ఈ కమిటీ ఇచ్చే నివేదికను అనుసరించి రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోనున్నారు. అయితే, రాహుల్ గాంధీ ఎలాంటి తప్పు చేయలేదని, ఆయన క్షమాపణలు చెప్పబోరని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ శశిథరూర్‌లు తేల్చిచెప్పారు. రాహుల్ గాంధీ పార్లమెంటుకు అతీతుడు కాదని, ఆయన క్షమాపణ చెప్పి తీరాలని కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, కిరెన్ రిజిజు, గోయల్‌లు డిమాండ్ చేశారు.