Himachal CM: హిమాచల్ కొత్త సీఎం ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ
Congress High Command is in dilemma to decide CM Candidate for Himachal Pradesh
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. సీఎం అభ్యర్ధిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం తర్జన భర్జన పడుతోంది. శాసనసభ పక్షనేత ఎన్నిక అధికారాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకవాఖ్య తీర్మానం చేశారు.
ముఖ్యమంత్రి రేసులో మాజీ సిఎం సతీమణి ఎంపీ ప్రతిభా సింగ్, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సిక్విందర్ సింగ్ సుఖు, ప్రతిపక్ష నాయకుడు ముఖేష్ అగ్ని హోత్రిలు నిలిచారు.
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న ప్రతిభా సింగ్ విస్తృతంగా ప్రచారం చేస్తూ బీజేపీని హడలెత్తించారు. మాజీ సీఎం వీరభద్ర సింగ్ భార్య అయిన ప్రతిభా సింగ్ ప్రస్తుతం ఎంతో చురుగ్గా వ్యవహరిస్తూ పార్టీ కార్యక్రమాలను చక్కబెట్టారు. కాంగ్రెస్‌ను గెలుపు బాట పట్టించారు. ఆమెకే సీఎం పదవి దక్కుతుందని చాలా మంది భావించారు. కానీ అధిష్టానం ఇంకా ఎటూ తేల్చడం లేదు. పలు రకాలుగా ఆలోచిస్తోంది.