కర్ణాటక ముఖ్యమంత్రి ఖరారయ్యారు. ముందు నుంచి అంచనా వేస్తున్నట్లుగా సిద్దరామయ్యకు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించేలా నిర్ణయం జరిగింది. ఈ మేరకు కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది.
Karnataka CM: కర్ణాటక ముఖ్యమంత్రి ఖరారయ్యారు. ముందు నుంచి అంచనా వేస్తున్నట్లుగా సిద్దరామయ్యకు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించేలా నిర్ణయం జరిగింది. ఈ మేరకు కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. అధికారికంగా ప్రకటనకు రంగం సిద్దమైంది. సీఎం రేసులో గట్టి పోటీ ఇచ్చిన డీకే శివకుమార్ కు డిప్యూటీ సీఎంగా నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఫార్ములా కు రాహుల్ ఆమోదం తెలిపారు. దీనికి డీకే మాత్రం పూర్తి స్థాయిలో అంగీకరించే లేదని సమాచారం. సాయంత్రానికి ప్రకటన..రేపు ప్రమాణ స్వీకారం ఉండేలా వేగంగా అడుగులు పడుతున్నాయి.
ఎట్టకేలకు కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా సిద్దరామయ్యకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ అయింది. సిద్దరామయ్య..డీకే శివకుమార్ మధ్య పదవుల పంపకాల ఫార్ములాను కాంగ్రెస్ హై కమాండ్ సిద్దం చేసింది. సూర్జేవాల ఇద్దరు పోటీదారులతో వరుస మంతనాలు చేసారు. ఢిల్లీలో రెండు రోజులుగా సాగుతున్న చర్చల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా రెండేళ్లు సిద్దరామయ్యను సీఎం చేసి..డీకే శివకుమార్ ను ఆ తరువాత రెండున్నారేళ్లు లేదా డీకేను డిప్యూటీ సీఎంగా అవకాశం ఇచ్చేలా సిద్దం చేసిన ఫార్ములా ప్రతిపాదించారు. సిద్దరామయ్య, డీకే శివ కుమార్ కు వివరించారు. రాహుల్ తుది నిర్ణయంగా ఈ ప్రతిపాదన ఇద్దరికి వివరించేందుకు కాసేపట్లో సమావేశం జరగుంది.
తొలి నుంచి సిద్దరామయ్యకు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేల మద్దతు లభించింది. తనకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ సిద్దరామయ్య పార్టీ నాయకత్వం ముందు తన వాదన వినిపించారు. ఇదే తన చివరి ఎన్నికని..తనకు 90 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని వివరించారు. వచ్చే ఎన్నికల్లో తన నియోజవకర్గంలో తన మనవడు పోటీ చేస్తారని పార్టీకి స్పష్టం చేసారు. ఇదే సమయంలో డీకే శివకుమార్ తన వాదన బలంగా వినిపించారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఎంతో శ్రమించానని..తనకు న్యాయం చేయాలని సూచించారు. ఈ సారి తనకు సీఎంగా అవకాశం ఇవ్వాలని డీకే శివకుమార్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
అసలు సిద్దరామయ్యను ఎందుకు సీఎం చేయాలని డీకే ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. తప్పదనుకుంటే ముందు మూడేళ్లు తనకు అవకాశం ఇచ్చి..చివరి రెండేళ్లు సిద్దరామయ్యకు ఛాన్స్ ఇవ్వాలని సూచించారు. కానీ, కాంగ్రెస్ నాయకత్వం మాత్రం సిద్దరామయ్యకు సీఎం పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య..డీకే శివకుమార్ మధ్య చెరి రెండున్నారేళ్ల పదవి ఆఫర్ చేసినా అందుకు డీకే శివకుమార్ అంగీకరించలేదని సమాచారం. ఈ సమయంలో అన్ని రకాలుగా డీకే శివకుమార్ ను ఒప్పించేందుకు రాహుల్ తన వద్దకు రావాలని శివకుమార్ కు సమాచారం ఇచ్చారు. రాహుల్ నిర్ణయం తీసుకోవటంతో డీకే శివకుమార్ అంగీకరించక తప్పని పరిస్థితి. దీంత, ఈ సాయంత్రం లోగా కొత్త ముఖ్యమంత్రి పైన ప్రకటన చేయనున్నారు. రేపు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి.
సిద్దరామయ్యకు ముఖ్యమంత్రిగా లైన్ క్లియర్ చేయటంలో కాంగ్రెస్ నాయకత్వం పంతం నెగ్గించుకుంది. సిద్దరామయ్యకు లైన్ క్లియర్ కావటంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సిద్దరామయ్య ఇంటి వద్ద బాణసంచా పేల్చారు. డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతల స్వీకరణకు సుముఖంగా లేరనే ప్రచారం నడుస్తోంది. డిప్యూటీ సీఎం హోదాతో పాటుగా కీలక శాఖలు అప్పగించేందుకు నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. కేబినెట్ లో ఎవరికి ఏ శాఖలు ఇవ్వాలనే దాని పైన ఢిల్లీలోనే కసరత్తు పూర్తి చేస్తున్నారు.
పుకార్లు నమ్మకండి…
అయితే చివరి నిమిషంలో కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ సూర్జేవాల మరో బాంబు పేల్చారు. సిఎం పదవిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇప్పటి దాకా వచ్చినవన్నీ పుకార్లేనని వాటిని నమ్మద్దని ప్రకటించారు.