Mallikarjuna Kharge: ఆస్కార్ ఘనత మాత్రం మీరు తీసుకోకండయ్యా..ఖర్గే
Mallikarjuna Kharge: ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో రాజ్యసభలోని సభ్యులందరు అభినందనలు తెలిపారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలో.. కీరవాణి సంగీతం అందించిన చంద్రబోస్ రాసిన ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ రావడం దేశానికే గర్వకారణమని దీని ద్వారా మన దేశ చిత్రాలకు గుర్తింపు వచ్చిందని కొనియాడారు. మన కళాకారుల ప్రతిభ, సృజనాత్మకతకు అంతర్జాతీయంగా లభించిన ప్రశంసగా ఈ అవార్డులను భావించాలన్నారు. ‘నాటు నాటు’ పాట దేశీయంగానే కాక.. అంతర్జాతీయంగా కూడా ప్రేక్షకుల మనసు దోచుకుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే నాటు నాటు’ పాటకు ఆస్కార్ రావడం తోపాటు మరో లఘుచిత్రం ద ఎలిఫెంట్ విస్పరర్స్ కు అవార్డు రావడంతో తన సంతోషాన్ని తెలిపారు. ఈ క్రమంలోనే ఈ సినిమాను మేమే డైరెక్ట్ చేశాం. మేమే పాట రాశాం. మోదీజీ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు అంటూ అధికారపార్టీ ఈ ఘనతను తన ఖాతాలో వేసుకుంటారేమో ఆలా వేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్న అని అనడంతో రాజ్యసభలో ఒక్కసారిగా అందరు నవ్వారు.