Cold Wave: ఈశాన్య రాష్టాలను వణికిస్తున్న చలి
Cold Wave:ఈశాన్య రాష్టాలను చలి వణికిస్తుంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. ఢిల్లీలో ఉదయం కనిష్ట ఉష్ణోగ్రత 1.4 డిగ్రీలుగా నమోదైంది. గతేడాది జనవరి 1న అత్యల్పంగా 1.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని, 2021 తర్వాత ఈ సీజన్‌లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదేనని తెలుస్తుంది. పొగమంచు కారణంగా విజిబిలిటీ క్షీణించడంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ సహా పొరుగు రాష్ట్రాల్లో పొగమంచు వాతావరణం ఏర్పడింది. హర్యానా రాష్టంలో హిస్సార్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 0.8 డిగ్రీలు కాగా, పంజాబ్‌లోని అమృతసర్‌లో 1.5 డిగ్రీలుగా నమోదైంది.
తెలుగు రాష్టాల్లో చలి పంజా విసురుతుంది. సాయంత్రం 5 గంటలనుండి మొదలైన చలి ఉదయం 9 గంటల వరకు చలి తగ్గడంలేదు. రాత్రి అయిందంటే చాలు జనం ఎవరు రోడ్లపైకి రావడంలేదు. ఏ రోడ్డు చూసిన అంత కాలంగా కనిపిస్తున్నాయి. సంక్రాంతి సమయంలో ఈ చలి తగ్గుముఖం పడుతుందనుకుంటే మరింత ఎక్కువగా చలి తన పంజా విసురుతుంది. ఎముకలు కొరికే చలిలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూ రోజువారీ పనులు చేసుకుంటున్నారు. హైదరాబాద్ లో సైతం ఉష్ణోగ్రతలు భారిగా పడిపోయాయి చలితో ప్రజలు వణుకుతున్నారు. సీజన్ నార్మల్ కంటే తక్కువగా నమోదవడంతో చలి తీవ్రత పెరిగింది.