Cold Wave in UP: చలితో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్.. యూపీలో 25 మంది మృతి
Cold wave in Uttar Pradesh kills 25 Persons in a single Day
చలి చంపేస్తుంది. ప్రాణాలను హరిస్తోంది. జనాలకు ఊపిరి ఆడకుండా చేస్తోంది. ఉక్కిరి బిక్కిరి చేసి చంపేస్తోంది. యూపీ వ్యాప్తంగా ఇటువంటి కేసులు ఎక్కువుగా కనిపిస్తున్నాయి. విపరీతమైన చలి కారణంగా అక్కడ పలు ప్రాంతాల్లోని ప్రజలు గుండెనొప్పితో చనిపోతున్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరంలో చలి కారణంగా చనిపోయిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే కాన్పూర్ 25 మంది గుండెనొప్పి కారణంగా, బ్రెయిల్ స్ట్రోక్ కారణంగా చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
చలి తీవ్రత ఎక్కువుగా ఉన్న కారణంగా బీపీ పెరిగిపోవడం, రక్తం గడ్డ కట్టడం వంటివి జరుగుతాయని అందువల్లే గుండెనొప్పి, బ్రెయిల్ స్ట్రోక్ వంటివి వచ్చి ప్రాణాలు పోతున్నాయని వైద్యులు వివరిస్తున్నారు. చలి తీవ్రత నుంచి ప్రజలు తమని తాము కాపాడుకోవాలని, పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
యూపీలో కార్డియాలజీ విభాగాలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ కీలక సూచనలు చేస్తున్నారు. చలి కారణంగా గుండె పోటు రావడం చాలా సాధారణ విషయంగా మారిందని, ఇది కేవలం పెద్దలకు మాత్రమే వస్తుందని అనుకోవడం పొరపాటని చెబుతున్నారు. యువతీ యువకులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.