Madhya Pradesh CM Shivraj Singh Chouhan: ముఖ్యమంత్రి కి తప్పిన పెను ప్రమాదం
Madhya Pradesh CM Shivraj Singh Chouhan: సంక్రాంతి పండగ వేళ ముఖ్యమంత్రికి పెను ముప్పు తప్పింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లా మనావర్ టౌన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. టెక్నీకల్ సమస్య వల్ల హెలికాఫ్టర్ ను అత్యవసరంగా ల్యాండ్ చేసారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అప్రమత్తమై సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. ముఖ్యమంత్రికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అధికార, పోలీసు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. దీనికోసం ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ధార్‌లో జరిగే బహిరంగసభలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఘటన జరిగింది. హెలికాఫ్టర్ సురక్షితంగా ల్యాండవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన తర్వాత సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రోడ్డు మార్గం ద్వారా ధార్ చేరుకున్నారు.