CM Kejriwal: హోలీకి దూరంగా కేజ్రీవాల్.. రోజంతా మెడిటేషన్లోనే!
CM Jejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈసారి హోలీ ఆడడం లేదు. హోలీ రోజు ఉదయం సీఎం కేజ్రీవాల్ మహాత్మా గాంధీ సమాధి వద్దకు చేరుకుని ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ తరువాత ఇంటికి చేరుకున్న ఆయన ధ్యాన భంగిమలో కూర్చున్న ఫోటోలు తెరపైకి వచ్చాయి. దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన చెందుతున్న సీఎం కేజ్రీవాల్ 7 గంటల పాటు ధ్యానం చేయబోతున్నట్టు ప్రకటించి ధ్యానంలో కూర్చున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేందర్ జైన్ ధైర్యవంతులని అభివర్ణిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. మోదీజీ తన ఇద్దరిలో వీరిద్దరిని జైల్లో పెట్టారని అన్నారు.
వారి అరెస్టుకు నిరసనగా, హోలీ జరుపుకోకుండా రోజంతా ధ్యానం చేయడానికి కూర్చున్నారు. హోలీ సందర్భంగా దేశం కోసం ప్రార్థిస్తానని కేజ్రీవాల్ మంగళవారం చెప్పారు. దేశాన్ని దోచుకునే వారు తప్పించుకుంటున్నారని, మంచి పనులు చేస్తున్న వారిని అరెస్టు చేస్తున్నారని అన్నారు. డిజిటల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కేజ్రీవాల్ మాట్లాడుతూ, దేశంలోని పరిస్థితి గురించి తాను ఆందోళన చెందుతున్నానని అన్నారు. ఢిల్లీ ఆరోగ్యం, విద్యా రంగాన్ని 65 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురి చేశారని, పేదలకు మెరుగైన వైద్యం, విద్య అందేలా మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ కృషి చేశారని ఆయన పేర్కొన్నారు.