CM Kcr: బీఆర్‌ఎస్ మహారాష్ట్ర డివిజన్ కోఆర్డినేటర్లను నియమించిన.. సీఎం కేసీఆర్
CM Kcr: ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ విస్తరణపై దృష్టిసారించారు. ముఖ్యంగా రాష్ట్రంతోపాటు దేశ రాజకీయాలపై పూర్తి ఫోకస్ పెట్టారు. ఇటీవలే మహారాష్ట్ర బీఆర్‌ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా మానిక్ కదమ్‌ను నియమించిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్.. తాజాగా ఆ రాష్ట్ర డివిజన్ కోఆర్డినేటర్లను నియమించారు. నాందేడ్ లో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ మహారాష్ట్రలో తన రాజకీయ లక్ష్యాన్ని స్పష్టం చేసారు. ఆ రాష్ట్రం నుంచి పార్టీలో చేరిన నేతలకు ఇప్పుడు డివిజన్ల వారీగా బాధ్యతలను ఖరారు చేసారు.
ఇటు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం అవుతూనే పార్టీని పొరుగు రాష్ట్రాల్లో నిర్మాణం చేయటం పైన కసతరత్తు చేస్తున్నారు. కీలక నియామకాలను పూర్తి చేస్తున్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో బీఆర్‌ఎస్ పార్టీ ముందుకు వెళుతున్నాడు సీఎం కెసిఆర్.. ఈ సమయంలోనే ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నియామకం పైన కేసీఆర్ తాజాగా నిర్ణయం ప్రకటించారు.
నాగ్‌పూర్ డివిజన్‌కు ద్యానేష్ వాకుడ్‌కర్, నాసిక్ డివిజన్ కు దశరథ సావంత్ , ముంబై డివిజన్‌కు విజయ్ తనాజి మోహితే ను నియమించారు. పుణె డివిజన్‌కు బాలసాహెబ్ జైరాం దేశ్‌ముఖ్, ఔరంగాబాద్ డివిజన్‌కుసోమ్‌నాథ్ థోరట్, ను నియమించిన కేసీఆర్ అమరావతి డివిజన్‌కునిఖిల్ దేశ్‌ముఖ్‌ను కోఆర్డినేటర్లుగా నియమించారు. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర బీఆర్‌ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీ గా హిమాన్షు తివారీ ని నియమించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే కేసీఆర్ ప్రకటించడం జరిగింది. రాబోయే రోజుల్లో మహారాష్ట్ర అంతటా పర్యటిస్తానని కేసీఆర్ ఈ సందర్బంగా తెలిపారు.