Karnataka: ఎట్టకేలకు కర్ణాటక (Karnataka) లో నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. ముఖ్య మంత్రి కుర్చీకాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్యకే (Siddaramaiah) దక్కింది. సీఎం రేసులో ఉన్న డీకే శివకుమార్‌కు (Dk shivakumar) డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు పలు కీలక శాఖల బాధ్యతలు అప్పగించింది అధిష్టానం.
Karnataka: ఎట్టకేలకు కర్ణాటక (Karnataka) లో నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. ముఖ్య మంత్రి కుర్చీకాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్యకే (Siddaramaiah) దక్కింది. సీఎం రేసులో ఉన్న డీకే శివకుమార్‌కు (Dk shivakumar) డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు పలు కీలక శాఖల బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇదిలా ఉండగా.. గురువారం సాయంత్రం 7 గంటలకు బెంగళూరులో సీఎల్పీ (CLP) సమావేశం జరగనుంది. క్వీన్స్ రోడ్డులో ఉన్న కాంగ్రెస్ కార్యాలయంలో కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈక్రమంలో డీకే శివకుమార్‌కు స్వాగతం పలుకుతూ పార్టీ శ్రేణులు భారీగా ఫ్లెక్సీలు, కటౌట్లను ఏర్పాటు చేశారు.
కేపీసీసీ సమావేశం సందర్భంగా పోలీసులు కాంగ్రెస్ కార్యాలయం వద్ద భారీగా మోహరించారు. కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా బెంగళూరులోని షాంగ్రిల్లా హోటల్‌కి చేరుకున్నారు. ఈ సమావేశంలో ఎల్పీ నేతగా సిద్ధరామయ్యను కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ప్రకటించనున్నారు. అలాగే పలు అంశాలపై ఎమ్మెల్యేలకు డీకే దిశా నిర్దేశం చేయనున్నారు.
సమావేశం ముగిసిన తర్వాత డీకే శివకుమార్, సిద్ధరామయ్య, కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కర్ణాటక గవర్నర్ తన్వార్ చంద్ గెహ్లాట్‌తో సమావేశం కానున్నారు. మరోవైపు ఈనెల 20న కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది.