ఢిల్లీలో ఎడతెగని పంచాయితీ
KARNATAKA CM : కర్ణాటక ముఖ్యమంత్రి (Chief Minister) ఎవరన్నది ఇవాళ సాయంత్రానికి స్పష్టత రానుంది. ముఖ్యమంత్రి ఎవర్న అంశంపై హై కమాండ్ స్పష్టత ఇవ్వనుంది. నిన్న సాయంత్రం ఢిల్లీ (Delhi) వెళ్లాల్సిన శివకుమార్ (Sivakumar)ఇవాళ హస్తిన చేరుకున్నారు. ఇద్దరితో పార్టీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే (Kharge) చర్చలు జరపునున్నారు. విడివిడిగా ఇద్దరితో భేటీఅయ్యాక నిర్ణయాన్ని హై కమాండ్ (High Command) కు వివరించాక తుది ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిద్దరామయ్య (Siddaramyya)వైపే మొగ్గు ఎక్కువగా ఉన్నప్పటికీ శివకుమార్ (DK)ను ఎలా సర్దుబాటు చేయాలన్న అంశంపై హై కమాండ్ తీవ్రంగా ఆలోచిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో కర్ణాటక (Karnataka)లో కాంగ్రెస్ చెప్పుకోదగ్గ పనితీరు కనబరచాలంటే డీకే శివకుమార్ సేవలు చాలా అవసరమని, ఆ నేపథ్యంలో ఆయన్ను జాతీయ రాజకీయాల్లోకి తేవడం సాధ్యంకాదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
వెన్నుపోట్లు పొడవను..
తనకూ చాముండేశ్వరి ఆశీస్సులున్నాయని అన్నారు డీకే. విమానాశ్రయానికి బయల్దేరే ముందు తన నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను వెన్నుపోటు పొడబోనని, బ్లాక్మెయిల్ చేయబోనని చెప్పారు.
రహస్య ఓటింగ్లో ఏం తేలింది
70 మంది శాసనసభ్యులు రాతపూర్వకంగా, 60 మంది రహస్య ఓటింగ్ ద్వారా వెల్లడించిన అభిప్రాయాలను సేకరించిన ఏఐసీసీ నేతలు సోమవారం దిల్లీకి చేరుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమై సమాలోచనలు జరిపారు. అభిప్రాయాలు బహిరంగంగా చెప్పడానికి కొందరు ఎమ్మెల్యేలకు ఉన్న ఇబ్బంది దృష్ట్యా వారు రహస్య బ్యాలెట్ కూడా నిర్వహించి ఆ పెట్టెలను తమతోపాటు దిల్లీకి తెచ్చారు.