CJI DY Chandrachud: కుమార్తెలతో కోర్టుకొచ్చిన సీజేఐ చంద్రచూడ్
CJI DY Chandrachud: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్.. తన ఇద్దరు దత్తత కూతుళ్లకు న్యాయస్థానానికి తీసుకొచ్చారు. వారి కోరిక మేరకు సుప్రీంకోర్టు పనితీరు, కార్యకలాపాలను దగ్గరుండి చూపించారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ దివ్యాంగులైన తన ఇద్దరు కుమార్తెలను కోర్టుకు తీసుకురావడాన్ని న్యాయవాదులు ఆసక్తిగా తిలకించారు. సందర్శకుల గ్యాలరీ నుంచి 10 గంటలకు తన కోర్టు రూమ్‌లోకి ప్రవేశించిన చీఫ్ జస్టిస్ ‘ఇదే నేను కూర్చునే ప్రదేశం’ అంటూ కుమార్తెలకు వివరించారు.
ఆయన విధుల గురించి తెలుసుకోవాలని అందుకే కోర్టుకు తీసుకు వెళ్లాలని వారు కోరారని తెలిపారు. లాయర్లు ఎక్కడ తమ వాదనలు వినిపిస్తారు? తదితర ప్రదేశాలను ఆయన స్వయంగా చూపించి వారికి వివరించినట్టు సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. ఇద్దరు ఆడపిల్లలో పెద్ద కుమార్తె పేరు ప్రియాంక. చిన్న కూతురి పేరు మహీ. ఇద్దరూ వికలాంగులే. వీల్ ఛైర్లకే పరిమితం అయ్యారు. వారిద్దరి కోరిక మేరకు సుప్రీంకోర్టు కార్యకలాపాలు ఎలా ఉంటాయనే విషయాన్ని ఆయన ప్రత్యక్షం చూపించారు. దీంతో వారు ఎంతగానో సంతోషించారు.