భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో(ISRO) ప్రయోగించిన చంద్రయాన్-3(Chandrayaan-3).. విజయవంతం కావడంపై రాజకీయం మొదలైంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యురాలు మహువా మొయిత్రా(Mahua Moitra).. చంద్రయాన్-3 సక్సెస్ నేపథ్యంలో మోదీ(Modi)పై సెటైర్లు సంధించారు. వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల(Loksabha Elections) కోసం ఇస్రో.. ఇక బీజేపీకి ప్రధాన ప్రచార అస్త్రంగా మారినట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
Chandrayaan-3 : భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో(ISRO) ప్రయోగించిన చంద్రయాన్-3(Chandrayaan-3).. విజయవంతం కావడంపై రాజకీయం మొదలైంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యురాలు మహువా మొయిత్రా(Mahua Moitra).. చంద్రయాన్-3 సక్సెస్ నేపథ్యంలో మోదీ(Modi)పై సెటైర్లు సంధించారు. వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల(Loksabha Elections) కోసం ఇస్రో.. ఇక బీజేపీకి ప్రధాన ప్రచార అస్త్రంగా మారినట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(Congress Committee) అధినేత మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge)కూడా ఇదే రకమైన కామెంట్స్ చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఖర్గే.. ఇస్రో అంశాన్ని ప్రస్తావించారు. ఇస్రోను ఎవరు నెలకొల్పారంటూ ప్రశ్నించారు. అంతరిక్ష పరిశోధనలను సాగించడానికి ఇస్రోను కాంగ్రెస్ ప్రభుత్వమే స్థాపించిందని గుర్తు చేశారు.
ఇస్రో ఒక్కటే కాదని, ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్, డీఆర్డీఓ, సెయిల్, హెచ్ఏఎల్, బీఈఎల్, ఓఎన్‌జీసీ.. వంటి ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలను దశాబ్దాల కిందటే కాంగ్రెస్ ప్రభుత్వమే నెలకొల్పిందని ఖర్గే పేర్కొన్నారు. వాటిని ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం చేయలేదని, అన్ని రాష్ట్రాల్లోనూ వాటిని స్థాపించిందని చెప్పారు. దేశాన్ని ఏకతాటిపైకి నడిపించిన ఘనత తమదేనని అన్నారు.
53 సంవత్సరాల వ్యవధిలో దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలదేనని, ఇదీ తమ ప్రోగ్రెస్ కార్డ్ అంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణలో అధికార భారత్ రాష్ట్ర సమితి, బీజేపీ(BJP) భాయి భాయిగా కలిసిపోయాయంటూ ఖర్గే విమర్శించారు. ఈ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందాలు కుదిరాయని ధ్వజమెత్తారు. ఒకరి గురించి ఒకరు విమర్శలు చేసుకోలేనంత గట్టి బంధం ఏర్పడిందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా 26 ప్రతిపక్ష పార్టీలు ఏకతాటి పైకి వచ్చి, ఎన్డీఏ కూటమిని ఓడించడానికి కృషి చేస్తున్నాయని, బీఆర్ఎస్ (BRS) మాత్రం తమతో కలిసి రావట్లేదని ఖర్గే అన్నారు. బీజేపీ-బీఆర్ఎస్ మధ్య లోపాయకారి ఒప్పందాలు కుదిరాయనడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు నిర్వహించిన ఏ ఒక్క సమావేశానికీ కేసీఆర్ (KCR) లేదా బీఆర్ఎస్ నాయకులు హాజరు కాలేదని గుర్తు చేశారు.