Nirmala Sitharaman: భారత్‌లోకి 8 లక్షల కోట్లు..ప్రవాస భారతీయుల ఘనత
Nirmala Sitharaman at Pravasi Divas: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 17వ ప్రవాసీ దివస్ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. కీలక ప్రసంగం చేశారు. ప్రవాస భారతీయులు భారత అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని కొనియాడారు. ప్రవాస భారతీయులు గతేడాది రూ. 8,17,713.5 కోట్లు పంపారని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇది 2021 ఏడాది కంటే 12 రెట్లు అధికమని అన్నారు. వివిధ దేశాల్లో ఉంటూ భారత్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వారికి భారతీయ సమ్మాన్ అవార్డులను ప్రధానం చేశారు.
ఈ అవార్డులను భారత ప్రధాని ద్రౌపది ముర్ము ప్రధానం చేశారు. భారత్ లో తయారైన వస్తువులను ప్రవాస భారతీయులు వినియోగించాలని, తద్వారా భారత వస్తువులకు విదేశాల్లో డిమాండ్ పెరుగుతుందని, ఫలితంగా ఎగుమతులు పెరుగుతాయని అన్నారు. భారత అభివృద్ధి కోసం పనిచేస్తున్నవారంతా భారత అంబాసిడర్లేనని అన్నారు. 70 దేశాల నుండి మూడు వేల మంది ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐటీ, డిజిటల్ టెక్నాలజీ, సెమీ కండక్టర్స్ తయారీ, ఆటోమొబైల్స్ రంగంలో భారతీయుల హవా కొనసాగుతోందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.