అమర్నాథ్ యాత్రపై (Amarnath Yatra) కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah)సమీక్ష జరిపారు. రివ్యూ మీటింగ్లో అమర్నాథ్ యాత్ర ఏర్పాట్లపై సమీక్షించారు. యాత్రికులకు అసౌకర్యం లేకుండా దర్శనం చేసుకునే విషయంపై చర్చించారు.
Amit Shah: అమర్నాథ్ యాత్రపై (Amarnath Yatra) కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah)సమీక్ష జరిపారు. రివ్యూ మీటింగ్లో అమర్నాథ్ యాత్ర ఏర్పాట్లపై సమీక్షించారు. యాత్రికులకు అసౌకర్యం లేకుండా దర్శనం చేసుకునే విషయంపై చర్చించారు. ఈ యాత్ర జులై ఒకటి నుంచి ఆగస్టు 31 వరకు 62 రోజుల పాటు కొనసాగనుంది. గత ఏడాది 3.5 లక్షల మంది భక్తులు పాల్గొనగా, ఈ ఏడాది 5 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. యాత్రకు వెళ్లే మార్గంలో పటిష్టమైన భద్రతా(security) ఏర్పాట్లు చేయాలని హోంమంత్రి ఆదేశించారు. విమానాశ్రయం, (Airport) రైల్వే స్టేషన్ నుంచి యాత్ర బేస్ క్యాంపు వరకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాలని ఆదేశించారు.
గత ఏడాది ఆకస్మిక వరదలు (Floods) వచ్చి 16 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో యాత్రికుల కోసం సురక్షిత ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేయడంపై జాతీయ విపత్తు స్పందన బృందం దృష్టి సారించింది. అమర్నాథ్ గుహకు ఎగువున ఉన్న హిమానీనదాల పరిస్థితిని భారత వాయుసేన (Indian Air Force)హెలికాప్టర్లు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయనున్నాయి. రిమోట్ సెన్సింగ్, ఉపగ్రహ, హైడ్రాలజీ, విపత్తు స్పందన బృందాల నిపుణులు ఈ తనిఖీలు చేయనున్నారు. అలాగే ఆక్సిజన్ సిలిండర్ల తగినంత నిల్వ ఉంచాలని, అదనపు వైద్య బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అమర్నాథ్ యాత్రికుల కోసం అవసరమైన రవాణా, బస, విద్యుత్, నీరు, కమ్యూనికేషన్, ఆరోగ్యంతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాల కోసం తగిన ఏర్పాట్లు చేయడంపై దృష్టి పెట్టాలని అన్నారు.