Centre Letters: పెరుగుతున్న ఎండలు.. వారిని ట్రాక్ చేయాలంటూ రాష్ట్రాలకు లేఖ
Centre Letters: పెరుగుతున్న ఎండల నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది. గుండె రోగులను ట్రాక్ చేయాలని రాష్ట్రాలకు లేఖ రాసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వాధికారులకు లేఖలు రాసినట్టు చెబుతున్నారు. ఈ ఏడాది ఎండలు పెరిగే అవకాశం ఉందని, కాబట్టి రాష్ట్రాలు కచ్చితంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారి డేటా సేకరించి అలర్ట్‌గా ఉండాలని ఈ లేఖలో సూచించిందని తెలుస్తోంది. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారిపై కచ్చితంగా రోజు వారీ నిఘా పెట్టాలని లేఖలో సూచించడం చర్చనీయాంశం అయింది. దేశంలో గుండె వ్యాధి నిఘా కోసం ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్‌ఫర్మేషన్ ప్లాట్ ఫామ్ ద్వారా రోజు వారి నిఘా పెడతామని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఆ లేఖలో పేర్కొనడంతో ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మధ్య అనేక మంది చిన్న వయసు వ్యక్తులు సైతం కన్నుమూస్తున్న క్రమంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు.