Central Govt on Amarnath Yatra: అమర్నాథ్ యాత్రికుల కోసం సరికొత్త రహదారి… 11కిమీ మేర సొరంగమార్గం
Central Govt on Amarnath Yatra: ప్రతి ఏడాది అమర్నాథ్ యాత్రకోసం భక్తులు పెద్ద సంఖ్యలో తమ పేర్లను నమోదు చేసుకుంటారు. అటు కేంద్ర ప్రభుత్వం ఈ యాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ బంధోబస్తును ఏర్పాటు చేస్తుంది. ఈ యాత్రకోసం ఇప్పటికే రెండు మార్గాలు ఉన్నాయి. మరోకటి ఎయిర్ మార్గం కూడా అందుబాటులో ఉన్నది. అయితే, ప్రత్యేకంగా మరో మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్దమౌతున్నది. ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఎదురైనా భక్తులు అమర్నాథుడిని దర్శించుకునేందుకు వీలుగా రోడ్డు మార్గాన్ని నిర్మించాలని నిర్ణయించింది.
చందన్‌వాడి-సంగం మధ్య 22 కిమీ మేర అధునాతనంగా రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 11 కిమీ మేర సొరంగమార్గం కూడా ఉన్నది. జాతీయ రహదారి 501లో ఈ రోడ్డును నిర్మిస్తున్నారు. ఐదేళ్లలో ఈ రోడ్డు మార్గాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు భక్తులు అమర్నాథ్ ను దర్శించుకునేందుకు లిడ్డర్ లోయ అంచులో ఇరుకైన కాలిబాట మార్గంలో ప్రయాణించాల్సి వచ్చేది. ఈ మార్గంలో ప్రమాదాలు అధికంగా జరుగుతుంటాయి. దీనికి ప్రత్యామ్నాయంగానే సరికొత్త రోడ్డు మార్గాన్ని నిర్మించనున్నట్లు కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.