Central Govt on Program Code: ప్రైవేట్ ఛానళ్లకు కేంద్రం హెచ్చరిక… ప్రోగ్రాం కోడ్ తప్పనిసరిగా అమలు చేయాలి
Central Govt on Program Code: కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ టీవీ ఛానళ్లకు సంబంధించిన కొన్ని సూచనలను జారీ చేసింది. కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ యాక్ట్ 1995 ప్రకారం ప్రతి ప్రైవేట్ ఛానల్ తప్పనిసరిగా ప్రోగ్రాం కోడ్‌ను అమలు చేసి తీరాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలను అమలు చేయని ఛానళ్లపై చర్యలు తీసుకుంటామని హుకుం జారీ చేసింది. మార్గదర్శకాల ప్రకారమై ప్రసారాలు టెలికాస్ట్ కావాలని సూచించింది. గత కొన్ని నెలలుగా క్రైమ్‌ను యధాతథంగా ప్రసారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రోడ్డు ప్రమాదాలు, మరణాలు, చిన్నారులపై జరుగుతున్న హింస, వృద్ధులు, మహిళలపై జరిగే నేరాలకు సంబంధించిన ప్రసారాలను యధాతథంగా ప్రసారం చేస్తున్నారని అభ్యంతరం తెలియజేసింది.
గైడ్‌లైన్స్ ప్రకారం మాత్రమే ప్రసారాలు ఉండాలని ఆదేశించింది. మృతదేహాల దృశ్యాలను కూడా యధాతథంగా ప్రసారం చేస్తున్నారని అభ్యంతరం తెలియజేసింది. ఇలాంటి వాటిని ప్రసారం చేయడం వలన చిన్నారులపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని, తప్పనిసరిగా మార్గదర్శకాలు పాటించాలని హెచ్చరించింది. యాక్ట్ ప్రకారం నడుచుకోకుంటే తీవ్రమైన, కఠినమైన చర్యలు తీసుకుంటామని సదరు శాఖాధికారులు హెచ్చరించారు. ఎవరు యాక్ట్‌ను పాలో కాకున్నా వారిపై చర్యలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.