Modi Cabinet: త్వరలో కేంద్ర క్యాబినెట్ విస్తరణ
Modi Cabinet: ఈ నెలాఖరులోగా కేంద్ర క్యాబినెట్ పునర్వ్యవస్తీకరణ జరుగుతుందని సమాచారం. ఈ నెల 31న పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఆలోపే రిపబ్లిక్ డే కి ముందే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అంటున్నారు పార్టీ పెద్దలు. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ, వచ్చే ఏడాది రానున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మంత్రి వర్గంలో మార్పులు చేయనున్నారు.2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలకు అనుగుణంగా మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది. కేంద్ర కేబినెట్ లో మొత్తంగా 83 మంది మంత్రులకు అవకాశం ఉంది. ప్రస్తుతం 78 మంది ఉన్నారు. 2024లో హ్యాట్రిక్ లక్ష్యంగా కొత్త మంత్రుల ఎంపిక జరగనుంది.
తెలంగాణ నుంచి మరొకరికి కేబినెట్లో చోటు దక్కొచ్చన్న ప్రచారం జరుగుతున్నది. కిషన్ రెడ్డి మినహా మిగిలిన ముగ్గురిలో బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపురావు ఉన్నారు. రాష్ట్రానికి చెందిన లక్ష్మణ్.. యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేబినెట్ విస్తరణలో సంజయ్, బాపురావు, అర్వింద్.. పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అలాగే ఈసారి ఎస్టీ కోటాలో సోయం బాపూరావుకు అవకాశం దక్కవచ్చన్న ప్రచారం జరుగుతుంది. అయితే ఏపీ నుంచి ఈసారి ఛాన్స్ లేదంటున్నారు పార్టీ నేతలు ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మోడీ ఆలోచిస్తునట్లు సమాచారం.
మరోవైపు బండి సంజయ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పదవీ కాలం తొందర్లోనే ముగియనుంది. తిరిగి అధ్యక్షుడిగా సంజయ్ నే కొనసాగిస్తారా…? లేక కేంద్ర మంత్రి పదవి ఇచ్చి ఈటలకు పార్టీ బాధ్యతలు ఇచ్చే అంశం కూడా పరిశీలనలో ఉందని తెలుస్తోంది. బండి సంజయ్ కే మంత్రిపదవి ఇస్తే..రాష్ట్ర అధ్యక్షుడిగా రాజీనామా చేయాల్సిందే. ఇక రాష్టంలో కెసిఆర్ కు ఎదురెళ్లి పోరాడే వ్యక్తి ధర్మపురి అరవింద్ ఉన్నారు..కానీ మళ్లీ బండి కె పగ్గాలుఇవ్వాలని చూస్తుంది కేంద్రం. ఒకవేళ మరోమారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండికే ఛాన్స్ ఇస్తే బీసీ నేత అయిన అరవింద్ క్యాబినెట్ లోకి వెళ్లే ఛాన్స్ ఉంది.