Central Cabinet Expansion: కేంద్ర కేబినెట్ లో ఛాన్స్ దక్కేదెవరికి..
Central Cabinet Expansion: కేంద్ర మంత్రి వర్గాన్ని విస్తరించాలని మోడీ సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2019లో రెండోసారి మోడీ సర్కార్ ఏర్పడిన తరువాత ఏర్పాటైన మంత్రి వర్గమే ప్రస్తుతం కొనసాగుతున్నది. మరో ఏడాన్నర కాలంలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో, పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో మంత్రి వర్గాన్ని విస్తరించి, కొంతమంది కొత్త వారిని కేబినెట్‌లోకి తీసుకోవాలని చూస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కేంద్ర కేబినెట్‌లోకి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను తీసుకోవాలని చూస్తున్నారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతలను మరొకరికి అప్పగించే అవకాశం ఉన్నది. దీంతో మధ్యప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఎవరికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తారనే టెన్సన్ నెలకొన్నది. ఇక, తెలంగాణ నుండి కూడా మరొక ఎంపీకి మంత్రి పదవికి అప్పగించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. బీసీ వర్గానికి చెందిన వారికి పదవి లభించనున్నట్లు సమాచారం. ఏపీ నుండి కూడా ఒకరికి అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎవరికి పదవులు దక్కుతాయో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.