Budget session of Parliament: జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
Budget session of Parliament starts from January 31
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జనవరి 31న ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలు 66 రోజుల పాటు కొనసాగనున్నాయి. 66 రోజుల్లో 27 సిట్టింగులు జరగనున్నాయి. సమావేశాల తొలి రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. గత ఏడాది ఆగస్టు నెలలో రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్మకు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించే తొలి అవకాశం బడ్జెట్ సమావేశాల సందర్భంగా కలగనుంది.
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ప్రకటించారు. జనవరి 31న ప్రారంభం కానున్న సమావేశాలు ఏప్రిల్ 6 వరకు కొనసాగనున్నట్లు తెలిపారు.
Budget Session, 2023 of Parliament will commence from 31 January and continue till 6 April with 27 sittings spread over 66 days with usual recess. Amid Amrit Kaal looking forward to discussions on Motion of Thanks on the President’s Address, Union Budget & other items. pic.twitter.com/IEFjW2EUv0
— Pralhad Joshi (@JoshiPralhad) January 13, 2023
బడ్జెట్ సమావేశాల తొలి భాగంలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానాలు జరగనున్నాయి. ఉభయ సభల్లోను సుదీర్ఘంగా చర్చ జరగనుంది. అదే విధంగా బడ్జెట్ విషయంలోను ఇరు సభల్లో వాడీ వేడి చర్చలు జరగనున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సభ్యులు లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వనున్నారు. బడ్జెట్ సెషన్ ద్వితీయ భాగంలో వివిధ శాఖల డిమాండ్లపై చర్చ జరగనుంది. బడ్జెట్ ఆమోద ప్రక్రియ పూర్తికానుంది.