Pak Drone: పాక్ డ్రోన్‌ని కూల్చివేసిన పంజాబ్ బీఎస్‌ఎఫ్ జవాన్లు
Pak Drone: గత అర్ధరాత్రి సమయంలో పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్ డ్రోన్‌ను బీఎస్‌ఎఫ్ జవాన్లు కూల్చివేశారు. అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉన్న చురివాలా చుస్తీ సమీపంలో బీఎస్‌ఎఫ్ జవాన్లు గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ వైపు నుంచి వస్తున్న ఓ డ్రోన్‌ను గుర్తించారు. దీంతో దానిపై కాల్పులు జరిపి కూల్చివేశారు. దానిని మూడు ప్యాకెట్లలో ఉన్న 7.5 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
దీంతోపాటు ఓ పిస్తోల్, రెండు మ్యాగజైన్లు, 50 రౌండ్ల 9 ఎంఎం బుల్లెట్లను సీజ్ చేశారు. ఆ ప్రాంతంలో గాలింపు ముమ్మరం చేశామని బీఎస్‌ఎఫ్ అధికారులు వెల్లడించారు. ఈ కన్‌సైన్ మెంట్‌ను ఎవరికి చేరవేస్తున్నారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా ఈ ఏడాది 17 పాక్ డ్రోన్లను కూల్చివేశామని అధికారులు చెప్పారు.
గత నెల 24న జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో అనుమానాస్పద డ్రోన్ కలకలం రేపింది. సాంబ జిల్లాలోని విజయ్‌పూర్ ప్రాంతంలో అనుమానాస్పద డ్రోన్.. ఓ ప్యాకెట్‌ని వదిలి వెళ్ళడంతో భారత భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. అందులో అత్యాధునిక ఆయుధాలున్నాయి. అవి పాకిస్తాన్‌కి చెందినవిగా గుర్తించారు. అలాగే ఐదు లక్షల కరెన్సీ కూడా గుర్తించారు. పాక్ ఇండియాపై ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది.