BRS vs BJP: ఢిల్లీలో బీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ ధర్నాలు
BRS vs BJP: ఢిల్లీలో బీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ ధర్నాలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. అసలు విషయం ఏమిటంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ధర్నా చేయనుండగా మరో పక్క పోటీగా ఢిల్లీ లిక్కర్ స్కాంకు వ్యతిరేకంగా బీజేపీ ధర్నా చేయనుంది. ముందు కవిత అనుకున్నట్టుగానే తొలుత బీజేపీ నేతలు కూడా జంతర్ మంతర్ వద్దే దీక్ష చేయాలని భావించగా.. తాజాగా వేదికని మార్చారు. మార్చిన వేదిక ప్రకారం దీనదయాల్ మార్గ్లో బీజేపీ నేతలు ధర్నా చేయనున్నారు. ఇక ఇది అంతా ఢిల్లీ వ్యవహారం కాగా మరో పక్క తెలంగాణలో పెరిగిన బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో బండి సంజయ్ దీక్ష చేయనున్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత 11వ తేదీన ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది, బీజేపీ నేతల కామెంట్లు కూడా దానికి బలం చేకూరుస్తున్నాయి.