Britain MP Praises: మోడీ భూమిపై అత్యంత శక్తివంతమైన నాయకుడు
Britain MP Praises Indian PM Modi: బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ సంస్థ ప్రధాని మోడీపై చేసిన డాక్యుమెంటరీ వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ డాక్యుమెంటరీ విషయంలో అనేక మంది బీబీసీ సంస్థను విమర్శిస్తున్నారు. 2002లో జరిగిన గోద్రా అల్లర్ల తరువాత ఇప్పటి వరకు గుజరాత్ రాష్ట్రంలో ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోలేదు. పైగా గోద్రా కేసులో నేతలకు సుప్రీంకోర్టు క్లీన్‌చీట్ ఇచ్చింది. ప్రస్తుతం దేశంలో గుజరాత్ రాష్ట్రంలో నెంబర్ వన్‌గా ఉన్నది. గుజరాత్ మోడల్‌తో మోడీ దేశానికి ప్రధాని అయ్యారు. దేశంలో అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని రంగాల్లోనూ దేశం అభివృద్ధి సాధిస్తున్నది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేతగా ప్రధాని ఎదిగారు.
బీబీసీ డాక్యుమెంటరీని భారత నేతలతో పాటు బ్రిటన్ నేతలు కూడా విమర్శిస్తున్నారు. ఇటీవలే బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సైతం విమర్శించారు. తాజాగా మరో ఎంపీ కూడా బీబీసీ డాక్యుమెంటరీపై విమర్శలు గుప్పించారు. భూమిపై అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ప్రధాని మోడీ ఒకరని ఎంపీ లార్డ్ కరణ్ వ్యాఖ్యానించారు. మోడీ చిన్నతనంలో గుజరాత్ రైల్వే స్టేషన్‌లో టీ అమ్మారని, ఇప్పుడు ఆ దేశానికి ప్రధాని అయ్యారని, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేతలగా ఎదిగారని కితాబిచ్చారు. మోడీపై ఇలాంటి డాక్యుమెంటరీలు రూపొందించడం సరికాదని అన్నారు. ప్రపంచ దేశాల చూపులన్నీ భారత్ వైపు ఉన్నాయని, ప్రపంచ మార్కెట్‌గా భారత్ ఎదుగుతోందని అన్నారు.