USAలో క్రికెట్ స్టేడియం నిర్మించనున్న బాలివుడ్ బాద్ షా
కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని బాలీవుడ్ బాద్ షా.. షారుక్ ఖాన్ అమెరికాలో క్రికెట్ స్టేడియం నిర్మించనున్నాడు. భారీ వ్యయంతో సుమారు పదివేల మంది కూర్చునేలా 15 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో షారుక్ ఈ స్టేడియాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. క్రికెట్ స్టేడియం కోసం కాలిఫోర్నియాలోని ఐర్విన్ సిటీని ఎంచుకున్నాడు. దీనికి సంబంధించిన పనులను కూడా ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి.
దేశవాళి క్రికెట్ జట్టు అయిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను కొనుగోలు చేయడం ద్వారా క్రికెట్ సంబంధిత వ్యాపారంలోకి అడుగు పెట్టిన షారుక్.. అమెరికాలో క్రికెట్‌కు అంతగా ప్రేరణ లేకపోవడంతో అక్కడ క్రికెట్ స్టేడియాలు ఏర్పాటు చేసి అమెరికా నుంచి కూడా క్రికెట్ జట్టును తయారు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.