Assembly Elections: ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ హవా, కాంగ్రెస్ ఘోర పరాజయం
BJP Victorious in North East States Assembly Elections
ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగించింది. స్వయంగా కొన్ని చోట్ల, మిత్ర పక్షాలతో కలిసి మరికొన్ని చోట్ల విజయకేతనం ఎగురవేసింది. ప్రధాన పతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాల్లో చతికిల పడింది. బీజేపీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. దీంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలారు.
మేఘాలయ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర పరాభవానికి లోనయింది. 17 స్థానాలను కోల్పోయింది. 5 స్థానాల్లో బిజేపి విజయం, 26 స్థానాల్లో ఎన్.పి.పి. గెలిచింది. మేఘాలయ లో ఎన్.పి.పి-బిజేపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
నాగాలాండ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత ఘోర పరాజయం పాలయింది. కనీసం ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది. నాగాలాండ్ రాష్ట్రంలో బీజేపీ కూటమికి 39 స్థానాలు లభించాయి. ఎన్.డి.పి.పి-బిజేపి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. త్రిపురలో కాంగ్రెస్ పార్టీ కేవలం 4 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. 33 స్థానాల్లో బీజేపి విజయం సాధించింది. త్రిపురలో బిజేపి ప్రభుత్వం కొలువదీరనుంది.