BJP tops in Income: బీజేపీకి భారీ ఆధాయం
BJP tops in Income: దేశంలో బీజేపీ ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది. కొన్ని రాష్ట్రాల్లో సొంతంగా అధికారంలో ఉంటే, మరికొన్ని రాష్ట్రాల్లో మిత్ర పక్షాలతో కలిసి అధికారాన్ని ఏర్పాటు చేసుకున్నది. దేశంలో వరసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ అన్ని విధాలుగా దూసుకుపోతున్నది. ఆదాయంలోనూ అందరికంటే ముందున్నది.
తాజా సమాచారం ప్రకారం 2022లో బీజేపీ ఆదాయం 1917 కోట్లుగా ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ వెల్లడించింది. బీజేపీకి బాండ్ల రూపంలో రూ. 1033.7 కోట్లు డొనేషన్లు అందినట్లు ఏడీసీ వెల్లడించింది. బీజేపీ తరువాత ఆదాయంలో తృణమూల్ కాంగ్రెస్ ఉన్నది. టీఎంసీ కి మొత్తం రూ. 545 కోట్ల రూపాయల ఆదాయం లభించగా, కాంగ్రెస్ పార్టీకి రూ. 541.275 కోట్ల ఆదాయం లభించినట్లు ఏడీసీ తెలిపింది.
ఇక, బీజేపీకి వచ్చిన మొత్తం ఆదాయంలో 854.467 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఏడీసీ తెలిపింది. టీఎంసీ 268.337 కోట్లు ఖర్చు చేయగా, కాంగ్రెస్ పార్టీ 400.414 కోట్లు ఖర్చు చేసినట్లు ఏడీసీ తెలియజేసింది. 2021-22లో బీజేపీ ఆదాయం 155 శాతం పెరగ్గా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆదాయం 633 శాతం పెరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఆదాయం 89.41 శాతం మేర పెరిగినట్లు ఏడీసీ తెలియజేసింది.