Bumper offer: శివసేనకు బీజేపీ ఆఫర్..13 మందికి మంత్రి పదవులు ?
Changing Maharashtra Politics: మహారాష్ట్రలో రాజకీయాలు మారుతున్నాయి. అధికారం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు కాదు.. శివసేన పార్టీకీ సైతం దూరం కానుంది. తనకు మద్దతు ఇస్తున్న 42 మంది ఎమ్మెల్యేలతో గౌహతిలో ఉన్న ఏక్ నాథ్ షిండేను అస్సో మంత్రి అశోక్ సింఘాల్ కలిశారు. బీజేపీకి మద్దతు ఇవ్వాలని రెబల్ ఎమ్మెల్యేలలో ఐదురికి రాష్ట్ర కేబినెట్ మంత్రులుగా, మరో ఎనిమిది మందికి సహాయ మంత్రుల పదవులు ఇస్తామని వారికి ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. వీరే కాకుండా వీరితో వచ్చే ఎంపీలకూ కేంద్ర మంత్రి పదవులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఆయన తెలిపారు.
దీంతో రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి తానే ముఖ్యమంత్రి అవుతాననే ఆశతో ఉన్న ఏక్ నాథ్ షిండే ఆశలు ఆవిరి అయ్యాయి. మరోవైపు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఇదివరకే ప్రకటించాడు. తనకు ముఖ్యమంత్రి పదవిపై ఆశలేదని ఎవరు సీఎం పీఠంపై కూర్చున్నా తానుమద్దతు తెలుపుతానని ఆయన తెలిపారు. ఏక్ నాథ్ షిండే మాత్రం ఉద్ధవ్ ఠాక్రే మాటలు పట్టించుకోవడం లేదు. మరోవైపు శివసేన నేత సంజయ్ రౌత్ కీలక ప్రకటన చేశారు. రెబల్ ఎమ్మెల్యేలలో 20 మంది తమకు టచ్‌లో ఉన్నారన్నారు. దీంతో మహారాష్ట్రలో రాజకీయం ఎటువెళ్తుందనే దానిపై స్పష్టత లేకుండా పోయింది.