JP Nadda: జేపీ నడ్డా పదవీకాలం పొడగింపు, 2024 జూన్ వరకు అధ్యక్షుడిగా కొనసాగింపు
BJP National President JP Nadda tenure extended till 2024 June
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా పదవీకాలం పొడిగించారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న బీజేపీ అగ్రనాయకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 2024 జూన్ వరకు జేపీ నడ్డా జాతీయ అధ్యక్షునిగా కొనసాగనున్నారు. పలు రాష్ట్రాల్లో అధ్యక్షుల పదవి కాలాన్నికూడా కొంత కాలం పాటు పొడగించనున్నారు.
జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీ, జేపీ నడ్డాల సారధ్యంలో బీజేపీ మళ్లీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేది బీజేపీనేనని అమిత్ షా అన్నారు. తెలంగాణ, బెంగాల్ లో పార్టీ పుంజుకున్న విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు.
హిమాచల్ ప్రదేశ్ కి చెందిన జేపీ నడ్డా చిన్ననాటి నుంచి చురుగ్గా ఉండేవారు. చిన్నతనంలో స్విమ్మింగ్ పోటీల్లో కూడా పాల్గొని బహుమతులు సాధించారు. రాజకీయాలంటే ఆసక్తి పెరగడంతో ఆ రంగంలో అడుగుపెట్టారు.1993లో బిలాస్ పుర్ నుంచి హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1998లో అదే స్థానం నుంచి మరోసారి పోటీ చేసి గెలిచారు. రాష్ట్ర క్యాబినెట్ ల మంత్రిగా పనిచేశారు.
ఆ తర్వాత కొంత కాలానికి రాజ్యసభలో అడుగుపెట్టారు. నరేంద్ర మోడీ అభిమాన పాత్రుడిగా మారారు. ఆరోగ్యశాఖ మంత్రిగా సేవలు అందించారు. 2019 జూన్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.అక్కడి నుంచి పార్టీని విజయ పథంలో నడిపిస్తునే ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలో నడ్డా కీలక పాత్ర పోషించారు. పార్టీ గెలుపుకు తీవ్రంగా పాటు పడ్డారు.
https://twitter.com/Sunil_Deodhar/status/1615300380690354177?s=20&t=5e4u6a1V8ShUlUaoC788pQ
Heartiest Congratulations to Hon'ble Shri @JPNadda Ji on his extension as BJP National President.@BJP4India pic.twitter.com/XCpmWvhOWX
— Rajesh Lawaria (पूर्व उपमहापौर) (@rajesh_lawaria) January 17, 2023
बीजेपी राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda जी का कार्यकाल जून 2024 तक बढ़ाये जाने पर हार्दिक शुभकामनाएँ. #BJPNationalExecutive #BJP4India #Nadda #BJPPresident pic.twitter.com/isUWzeGi9X
— माया शर्मा ब्लॉक प्रमुख भाजपा (@Mayasha14816211) January 17, 2023