BJP Meeting: ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు..ట్రాఫిక్ ఆంక్షలు!
BJP National Meeting: దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. సోమవారం, మంగళవారం రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లతో పాటు 350 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ సమావేశాల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పదవి కాలం పొడిగించే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది జరిగే పలు రాష్ట్రాల ఎన్నికలకు సమాయత్తం అయ్యేందుకు బీజేపీ కార్యకర్తలకు సమాయత్తం అవుతోంది. రాజకీయ, ఆర్థిక అంశాలపై జాతీయ కార్యవర్గం తీర్మానాలు చేయనుంది. జాతీయ కార్యవర్గ సమావేశం మొదటి రోజున దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని రోడ్ షో చేయనున్నారు, కిలోమీటర్ పొడవున ఈ రోడ్ షో జరగనుంది. ప్రధాని రోడ్ షో సందర్భంగా రోడ్డు పొడవునా వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులతో బీజేపీ నేతలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి జరగనున్న ప్రధాని రోడ్ షో సంధర్భంగా ప్రత్యేకంగా పోలీసులు ట్రాఫిక్ ఏర్పాట్లు చేశారు. ఇక మధ్యాహ్నం 2.30 గంటలకు సాయంత్రం 5 గంటలకు ప్రధాని భద్రతను దృష్టిలో ఉంచుకుని రోడ్ షో జరిగే రోడ్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.